శ్రీలంక: 6 గంటల నుంచి కర్ఫ్యూ విధింపు

కొలంబో: నేటి సాయంత్రం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రెసిడెన్షియల్ సెక్రటేరియట్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జరిగిన పేలుళ్ల దర్యాప్తునకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది. రక్షణశాఖ మంత్రి రువాన్ విజయవర్దనే స్పందిస్తూ.. ఈ విషయంపై ఐజీపీ పుజిత్ జయసుందరాతో పాటు భద్రతా ఉన్నతాధికారులతో చర్చించినట్లు తెలిపారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ కర్ఫ్యూని విధిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Related Stories: