హిందీలో రీమేక్ కానున్న మ‌హేష్ ఫ్లాఫ్ మూవీ..!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, స్టార్ డైరెక్ట‌ర్ మురుగదాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన చిత్రం స్పైడ‌ర్‌. తెలుగు, త‌మిళంలో విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్టింది. నిర్మాత‌ల‌కి భారీ న‌ష్టాల‌నే మిగిల్చింది. అయితే ఇప్పుడు ఈ సినిమాని మురుగ‌దాస్ హిందీలో రీమేక్ చేయాల‌నుకుంటున్నాడ‌ట‌. తాజా ఇంట‌ర్వ్యూలో మురుగదాస్ స్పైడ‌ర్‌ని హిందీలో రీమేక్ చేస్తాన‌ని చెప్ప‌డంతో ప్ర‌స్తుతం ఈ వార్త అంతటా హాట్ టాపిక్‌గా మారింది. ఇటు తెలుగు అటు త‌మిళంలో స‌రిగా ఆద‌ర‌ణ పొందని చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసి మురుగ‌దాస్ సాహ‌సం చేయాల‌నుకుంటున్నాడా అని ఫిలింన‌గ‌ర్ వాసులు ముచ్చటించుకుంటున్నారు. మ‌రి మురుగ‌దాస్ త‌న రీమేక్ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌ల‌కి ఎవ‌రెవ‌ర‌ని ఎంపిక చేసుకుంటాడో చూడాలి. అయితే మ‌హేష్ పాత్ర కోసం స‌ల్మాన్‌తో సంప్ర‌దింపులు జ‌ర‌పాల‌ని ద‌ర్శ‌కుడు భావిస్తున్న‌ట్టు స‌మాచారం. బైలింగ్యువ‌ల్ మూవీగా తెర‌కెక్కిన స్పైడ‌ర్ చిత్రం మ‌హేష్ బాబు, ర‌కుల్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన సంగ‌తి తెలిసిందే. ఎస్ జె సూర్య ఇందులో ప్ర‌తి నాయ‌కుడి పాత్ర‌లో కనిపించి మెప్పించాడు.

× RELATED కష్టాల్లో చైనా.. 28 ఏళ్ల కనిష్ఠానికి జీడీపీ వృద్ధిరేటు