బాహుబలిగా శివరాజ్‌సింగ్ చౌహాన్

రాజకీయ ప్రచారానికి సినిమా వీడియోలను వాడుకోవడం కొత్తేమీ కాదు. తాజాగా మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ బాహుబలి అవతారం ఎత్తారు. బాక్సాఫీసును బద్దలు కొట్టిన సూపర్‌డూపర్ హిట్ సినిమా బాహుబలి అయితే బాగుంటుందనుకున్నారేమో బీజేపీ కార్యకర్తలు ఓ స్పెషల్ వీడియో తయారుచేశారు. అందులో హీరో ప్రభాస్ పాత్రకు శివరాజ్ ముఖం అతికించారు. శివరాజ్‌సింగ్ అనే నేను మధ్యప్రదేశ్ ప్రజల గౌరవాన్ని, సంపదను కాపాడుతానని మా ఇస్తున్నాను.. ఇందుకు అవసరమైతే నా ప్రాణాలు ఒడ్డుతాను.. నా మాటే శాసనం అంటూ ప్రతిజ్ఞ చేయడం ఇందులో చూడొచ్చు. శివరాజ్ మహాశివలింగాన్ని భుజాలకెత్తితే రాహుల్, సోనియా తదతర కాంగ్రెస్ నేతలు కండ్లు అప్పగించి చూడడం వంటి దృశ్యాలు కూడా ఇందులో ఉన్నాయి. కట్టప్పగా కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్‌ను, విలన్ భల్లాలదేవునిగా జ్యోతిరాదిత్య సింధియాను చూపారు. ప్రజలు రకరకాల సమస్యలతో సతమతమవుతుంటే పాలక బీజేపీ ఇలాంటి వీడియోలు తీయడం ఏం బాగాలేదని అన్నారు. అసలు బాహుబలి ఎవరో ఎన్నికల్లో తేలిపోతుందని అంటున్నారు. ఈ వీడియోకు తమకూ ఎలాంటి సంంబధం లేదని, పార్టీ అభిమానులు ఎవరో తయారు చేసి ఉంటారని బీజేపీ అంటున్నది.
× RELATED ఒంటిపై కిరోసిన్ పోసుకొని మహిళ ఆత్మహత్య