నిమజ్జన ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు..

హైదరాబాద్ : వినాయక నిమజ్జనం సందర్భంగా నిమజ్జన ప్రాంతాలకు స్పెషల్ బస్సులు నడుపనున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినోద్‌కుమార్ తెలిపారు. ఆదివారం జరిగే నిమజ్జనానికి ప్రయాణికులకు బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. గ్రేటర్ పరిధిలోని 29 డిపోల నుంచి బస్సులు నడుస్తాయని, బస్సుల ఆపరేషన్స్‌లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా 33మంది ఆఫీసర్లను, 40 మంది సూపర్‌వైజర్లను, 70 మంది మెకానిక్‌లను, 100 మంది డ్రైవర్లు, 50 మంది సెక్యూరిటీ సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. పోలీసులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ప్రయాణ ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పనిచేస్తుందని తెలిపారు.

Related Stories: