ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్ : సంక్రాంతి పండుగ పురస్కరించుకొని భారీ సంఖ్యలో ప్రజలు.. పట్నం నుంచి తమ సొంత ఊర్లకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్‌కు తిరిగి వచ్చే ప్రయాణికుల కోసం రెండు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. కాకినాడ టౌన్ నుంచి సికింద్రాబాద్, నర్సాపూర్ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. జనవరి 17న రాత్రి 10.30 గంటలకు కాకినాడ టౌన్ నుంచి సువిధ స్పెషల్ ట్రైన్(82707) సికింద్రాబాద్‌కు బయల్దేరును. మరుసటి రోజు ఉదయం 9.45 నిమిషాలకు సికింద్రాబాద్‌కు రైలు చేరుకోనుంది. ఈ ప్రత్యేక రైలు సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్లగొండ రైల్వే స్టేషన్లలో ఆగును. నర్సాపూర్ - హైదరాబాద్ ప్రత్యేక రైలు(07049) నర్సాపూర్‌లో జనవరి 16న రాత్రి 7.30 గంటలకు హైదరాబాద్‌కు బయల్దేరును. మరుసటి రోజు ఉదయం 9.45 నిమిషాలకు హైదరాబాద్‌కు రైలు చేరుకోనుంది. ఈ రైలు పాలకొల్లు, భీమవరం, భీమవరం టౌన్, అకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్లగొండ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో ఆగును.

Related Stories: