పలు రైళ్లు రద్దు: దక్షిణమధ్య రైల్వే

హైదరాబాద్ : టిట్లీ తుఫాన్ నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే పలు రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ఎర్నాకులం నుంచి బయలుదేరే దాత్రి ఆబా ఎక్స్‌ప్రెస్‌తోపాటు వాస్కోడిగామా నుంచి కాచిగూడ మీదుగా వెళ్లే హౌరా ఎక్స్‌ప్రెస్‌లో వాస్కోడిగామా కాచిగూడ స్లిప్ కోచ్‌లను రద్దు చేశారు. బెంగళూరు నుంచి బయలుదేరే హౌరా ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేశారు.అదేవిధంగా యశ్వంత్‌పూర్ నుంచి బయలుదేరే హౌరా ఎక్స్‌ప్రెస్‌తోపాటు,యశ్వంత్‌పూర్ నుంచి ముజఫర్‌నగర్ మధ్య రాకపోకలు సాగించే యశ్వంత్ ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను పునరుద్దరించినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి హౌరా ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను పునరుద్దురించినట్లు తెలిపారు. హౌరా-చెన్నై మధ్య నడిచే హౌరా ఎక్స్‌ప్రెస్‌తోపాటు శాలీమార్- నాగర్‌సోల్ గురుదేవ్ ఎక్స్‌ప్రెస్‌ను ఖరగ్‌పూర్, టాటానగర్, బిలాస్‌పూర్,నాగపూర్, బల్హార్ష, కాజీపేట్, విజయవాడ మీదుగా మళ్లించారు.

× RELATED రెండు నెలల పాటు 20 రైళ్లు రద్దు