సైనికులూ సోషల్ మీడియాను వాడుతారు : ఆర్మీ చీఫ్

న్యూఢిల్లీ: సోషల్ మీడియాను సైనికులు కూడా వాడుతారని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ స్పష్టం చేశారు. మోసాలకు చెక్ పెట్టేందుకు, సైకలాజికల్ దాడులను ఎదుర్కొనేందుకు సోషల్ మీడియాను వాడనున్నట్లు ఆయన వెల్లడించారు. మన అడ్వాంటేజ్ కోసం సోషల్ మీడియాను వాడుకోవాల్సిందే అని ఆయన అన్నారు. సోషల్ మీడియాకు సైనికులను దూరంగా ఉంచాలన్న సలహాలు వస్తున్నాయని, కానీ స్మార్ట్‌ఫోన్ వాడకుండా సైనికులను అడ్డుకోలేమని, ఫోన్‌ను వద్దనలేననప్పుడు, దాన్ని వాడుకోనివ్వడమే బెటర్ అని ఆర్మీ చీఫ్ అన్నారు. కానీ కొన్ని క్రమశిక్షణా నియమావళితో దాన్ని వాడుకునే విధంగా సైనికులను తీర్చిదిద్దాలన్నారు. ఆధునీక సమాజంలో సమాచార యుద్ధం కూడా ముఖ్యమైందన్నారు. ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ ఆ అంశాన్ని సోషల్ మీడియా ద్వారానే సేకరించగలమని ఆర్మీ చీఫ్ అన్నారు. శ్రీనగర్‌లో ఓ అమ్మాయితో హోటల్‌కు వెళ్లిన మేజర్ గగోయ్ ఘటనపైన కూడా బిపిన్ రావత్ స్పందించారు. అతనిపై కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశించామని, దోషిగా తేలితే కఠినమైన శిక్ష విధిస్తామన్నారు.

Related Stories: