రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి

తూర్పుగోదావరి: సామర్లకోట సాంబమూర్తి రిజర్వాయర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను టిప్పర్ ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనాస్థలిలో నలుగురు మృతి చెందగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. క్షతగాత్రులను కాకినాడ జీజీహెచ్ ఆస్పత్రికి తరలించారు.

మృతుల్లో మూడేళ్ల చిన్నారితో పాటు నలుగురు మహిళలు, ఆటో డ్రైవర్ ఉన్నారు. మృతులు కాకినాడ గ్రామీణ మండలం రామేశ్వరం వాసులుగా గుర్తించారు. పెద్దాపురం మండలం వడ్లమూరులో శుభకార్యక్రమంకు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారణమైన టిప్పర్‌ను పోలీసులు సామర్లకోట మండలంలోని రాక్ సిరామిక్ పరిశ్రమ వద్ద పట్టుకున్నారు.

× RELATED ఇంజిన్ రహిత రైలు ట్రైయిల్ రన్ విజయవంతం