భూకబ్జా కేసులో ఆరుగురు అరెస్ట్

రంగారెడ్డి: హయత్‌నగర్ ప్రాంతంలో భూకబ్జా కేసులో వనస్థలిపురం పోలీసులు ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. పోలీసులు ఆరుగురు నిందితుల నుంచి రూ.100 జ్యుడీషియల్ స్టాంప్‌లు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు 200ప్లాట్లను నకిలీ సంతకాలతో మరొకరికి రిజిస్ట్రేషన్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులు దాదాపు రూ.14కోట్ల విలువైన భూమిని నకిలీ సంతకాలతో విక్రయించినట్లు పోలీసులు తెలిపారు.
× RELATED నాటు తుపాకీ స్వాధీనం: ఇంజినీరింగ్ విద్యార్ధి అరెస్టు