ఆస్ట్రేలియాలో సిస్టర్ ఫర్ చేంజ్ గిఫ్ట్ ఏ హెల్మెట్ కార్యక్రమం

హైదరాబాద్ : నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రతిష్టాత్మికంగా చేపట్టిన "సిస్టర్ ఫర్ చేంజ్ గిఫ్ట్ ఏ హెల్మెట్" కార్యక్రమాన్ని టీఆర్ఎస్ ఆస్ట్రేలియా వైస్ ప్రెసిడెంట్ రాజేష్ గిరి రాపోలు, విమెన్ వింగ్ ఇంచార్జి సంగీత దూపాటి ఆధ్వర్యంలో సిడ్నీ నగరంలో ఘనంగా నిర్వహించారు. ఇండియాలో అన్ని రంగాల ప్రముఖుల మన్ననలు పొందిన ఈ కార్యక్రమాన్ని ఇంకా విస్తృత ప్రచారం కల్పించి కవిత గొప్ప సంకల్పానికి ఆస్ట్రేలియాలో మద్దతు పలుకుతూ సిడ్నీలో ఈ కార్యక్రమాన్నినిర్వహించిన రాజేష్ రాపోలు, సంగీత దూపాటి, ప్రవీణ్ రెడ్డిలను టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల అభినందించారు. హెల్మెట్ వాడక పోవడం వలన ప్రతి సంవత్సరం డెబ్భై వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ప్రమాదాలను అరికట్టడానికి హెల్మెట్ వాడకంతో కలిగే ప్రయోజనాలను సిస్టర్స్ ద్వారా హెల్మెట్ ను బహుకరించడం అనే ఈ వినూత్నకార్యక్రమానికి మద్దతు తెలుపుతూ విమెన్ వింగ్ ఇంచార్జి సంగీత, వైస్ ప్రెసిడెంట్ రాజేష్ రాపోలు, న్యూ సౌత్ వేల్స్ ఇంచార్జి ప్రవీణ్ రెడ్డి, విక్రమ్ కటికనేని, వరుణ్ నల్లెల్ల, పరశురామ్, జస్వంత్ లకి రాఖీలు కట్టి హెల్మెట్ లను బహుకరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని మద్దతు తెలిపిన టీఆర్ఎస్ ఆస్ట్రేలియా నాయకులు జస్వంత్ కోదారపు, లక్ష్మణాచార్యులు, వరుణ్ నల్లెల్ల, పరశురామ్ ముటుకుల్ల, రవి శంకర్ దూపాటి, రవి సూరిశెట్టి, ఎండీ ఇస్మాయిల్, రవీందర్ రెడ్డి, స్మ్రితి రోహిత్, టీ నరేందర్ మరియు వివిధ సంఘాల నాయకులకు న్యూ సౌత్ వేల్స్ ఇంచార్జి ప్రవీణ్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు .
× RELATED ఒంటిపై కిరోసిన్ పోసుకొని మహిళ ఆత్మహత్య