రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవికి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రాజీనామా

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవికి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు ప్రభుత్వం ఆయన రాజీనామా ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆదివారం టీఆర్ఎస్ అభ్యర్థిగా బీ ఫాం అందుకోవడం, సోమవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయిన నేపథ్యంలో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలన్న ఉద్దేశంతో పదవికి రాజీనామా చేసినట్లు నిరంజన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తన మీద నమ్మకంతో పదవిని ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పదవీకాలంలో సహకరించిన అన్ని స్థాయిల, అన్ని జిల్లాల అధికారులకు, ప్రత్యేకించి ఉమ్మడి పాలమూరు జిల్లాల అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పదవి మూలంగా వనపర్తి అభివృద్దిలో సహకరించిన ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Related Stories: