ధోనీ బాత్‌రూమ్ ఇంటర్వ్యూ చూశారా.. వీడియో

రాంచీ: క్రికెట్ మ్యాచుల్లో నరాలు తెగే ఉత్కంఠలోనూ కూల్‌గా ఉండటం టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీకి అలవాటు. అందుకే అతన్ని మిస్టర్ కూల్ అంటారు. ఇదే ప్రశ్నను బాలీవుడ్ సింగర్ రాహుల్ వైద్యా కూడా ధోనీని అడిగాడు. అయితే అది ఓ బాత్‌రూమ్‌లో కావడం విశేషం. ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్ ముగిసిన తర్వాత ఇండియాకు తిరిగొచ్చిన మిస్టర్ కూల్.. ఈ మధ్య మాజీ మంత్రి ప్రఫుల్ పటేల్ కూతురు పూర్ణా పటేల్ పెళ్లికి వెళ్లాడు. అక్కడికి ఇండియన్ ఐడల్ ఫేమ్, సింగర్ రాహుల్ వైద్య కూడా వచ్చాడు. ఈ ఇద్దరూ బాత్‌రూమ్‌లో చేసిన చిట్‌చాట్ వీడియోను రాహుల్ పోస్ట్ చేశాడు. బాత్‌రూమ్‌లో కూడా మీరింత కూల్‌గా ఎలా ఉంటారు అని రాహుల్.. ధోనీని ఓ చిలిపి ప్రశ్న వేస్తే.. దానికి ధోనీ కూడా తనదైన ైస్టెల్లో ఆన్సరిచ్చాడు. ఇప్పుడీ బాత్‌రూమ్ ఇంటర్వ్యూ వీడియో వైరల్‌గా మారిపోయింది.

Related Stories: