భారతదేశం ప్రపంచానికే ఆదర్శం

-జాతీయ సమైక్యతా దినోత్సవంలో సింగరేణి జీఎం ఆంథోనిరాజా హైదరాబాద్, నమస్తే తెలంగాణ: వివిధ మతాలు, భాషలు, సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమై, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా ఉన్న భారతదేశం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నదని సింగరేణి సంస్థ జనరల్ మేనేజర్ (కోఆర్డినేషన్), చీఫ్ పబ్లిక్ ఆఫీసర్ ఆంథోనిరాజా అన్నారు. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో బుధవారం జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని నిర్వహించిన సందర్భంగా మాట్లాడుతూ.. దేశ స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రజలు ఐకమత్యంగా మెలగాలని పేర్కొన్నారు. కోల్‌మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సింగరేణి శాఖ జనరల్ సెక్రటరీ ఎన్‌వీ రాజశేఖర్‌రావు మాట్లాడుతూ.. దేశంలో అనేక మతాలు ఉన్నప్పటికీ పరమత సహనంతో, తోటి వారిపై ఆప్యాయతానురాగాలు చూపిస్తూ, కలసిమెలసి జీవించడమే భారతీయతత్వం అన్నారు. అనంతరం ఉద్యోగులు జాతీయ సమైక్యతా ప్రతిజ్ఞ చేశారు.