సెప్టెంబ‌ర్‌లో వ‌స్తున్న 'సిల్లీ ఫెల్లోస్'

కామెడీ హీరోస్ అల్లరి నరేష్, సునీల్ కథానాయకులుగా ఓ మల్టీ స్టారర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హీరోయిజంతో పాటు కామెడీని కలగలిపి ప్రేక్షకులని కడుపుబ్బ నవ్విస్తున్న ఈ ఇద్దరు హీరోల సినిమా అంటే ప్రేక్షకులలో మరింత ఆసక్తి నెలకొంది. నరేష్ తో సుడిగాడు అనే చిత్రాన్ని తీసిన భీమినేని శ్రీనివాస్ ఈ ప్రాజెక్ట్ డీల్ చేస్తున్నాడు. సిల్లీ ఫెల్లోస్ అనే టైటిల్‌తో రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 7న విడుద‌లయ్యేందుకు సిద్ధ‌మైంది. సినిమాకి సంబంధించిన అన్ని ప‌నులు పూర్తి కావ‌డంతో సినిమాకి సంబంధించిన ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌ని భారీగా నిర్వ‌హించాల‌ని భావిస్తున్నార‌ట‌. కొన్నాళ్ళుగా స‌రైన హిట్స్ లేని హీరోలు సునీల్‌, అల్ల‌రి న‌రేష్ ఈ ప్రాజెక్ట్‌పై భారీ హోప్స్ పెట్టుకున్నారు. చిత్రంలో కథానాయికలుగా రకుల్ ప్రీత్ సింగ్, లావణ్య త్రిపాఠిలని తీసుకున్నార‌ని టాక్‌. గతంలో అల్లరి నరేశ్ .. సునీల్ కాంబినేషన్లో 'తొట్టి గ్యాంగ్' సినిమా వచ్చింది. ఆ సినిమాలో అల్లరి నరేశ్ హీరో అయితే .. సునీల్ కమెడియన్‌గా నటించిన విషయం విదితమే. ప్ర‌స్తుతం సునీల్ హీరోగానే కాక క‌మెడీయ‌న్‌గా ప‌లు సినిమాల‌లో న‌టిస్తున్నాడు. అల్ల‌రి న‌రేష్ మ‌హేష్ మ‌హ‌ర్షి సినిమాలో కీల‌క పాత్ర పోషిస్తున్నాడు.

Related Stories: