ఏసీబీ వలలో ఎస్ఐ యస్తారమ్మ

సూర్యాపేట: అవినీతికి పాల్పడుతూ ఎస్ఐ యస్తారమ్మ(రాణి) ఏసీబీ అధికారులకు పట్టుబడింది. సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ పోలీస్ స్టేషన్ పై ఏసీబీ అధికారుల దాడి చేశారు. ఈ సందర్భంగా మట్టంపల్లి మండలం బక్కమంతులగూడెం రైతుల డబ్బు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అమరవరం బక్కమంతులగూడెం శివారులో ఓ భూ వివాదంలో స్టేషన్ బెయిల్ ఇప్పించటం విషయంలో రూ. 12 వేలకు ఒప్పందం కాగా అందులో రూ. 8 వేలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది.
× RELATED ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారి