స్టైలిష్ స్టార్ కి స్వల్ప విరామం.. 2 రోజుల్లో ఇంపాక్ట్ గిఫ్ట్

నూతన సంవత్సరం కానుకగా బన్నీతన అభిమానులకి స్టైలిష్ గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. జనవరి 1న ‘ఫస్ట్ ఇంపాక్ట్’ టీజర్ను విడుదల చేయనున్నట్లు బన్నీ రీసెంట్ గా తన ట్విట్టర్ ద్వారా తెలియజేసిన సంగతి తెలిసిందే. 1 నిమిషం 20 సెకన్ల నిడివితో రూపొందిన వీడియోలో ఆయన గత చిత్రాల కంటే భిన్నంగా కనిపిస్తారని చిత్ర బృందం చెబుతుంది. బన్నీ తాజా చిత్రం నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా అనే టైటిల్ తో తెరకెక్కుతుండగా ఈ చిత్రంలో బన్నీ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నట్టు తెలుస్తుంది. వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నా పేరు సూర్య చిత్రంలో అను ఎమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తుంది. 2018 ఏప్రిల్ 27న విడుదల కానున్న ఈ చిత్రం కోసం బన్నీ తన మేకొవర్ పూర్తిగా మార్చుకున్నాడు. ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణను పూర్తి చేసుకుంది ఈ చిత్రం. అయితే న్యూ ఇయర్ సందర్భంగా షూటింగ్ కి కాస్త బ్రేక్ ఇచ్చి జనవరి 4 నుండి యధావిధిగా షూటింగ్ లో పాల్గొంటాడట మన స్టైలిష్ స్టార్. ఈ గ్యాప్ లో కొత్త సంవత్సరం వేడుకలలో భాగంగా ఫ్యామిలీతో స్మాల్ ట్రిప్ వేస్తాడని టాక్. లగడపాటి శ్రీధర్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో, యాక్షన్ కింగ్ అర్జున్ విలన్ గా నటిస్తున్నాడు. దేశభక్తి నైపథ్యంలో ఈ సినిమా ఉండనుంది. ప్రముఖ సినిమాటోగ్రఫర్ రాజీవ్ రవి కెమెరా వర్క్ అందిస్తున్న ఈ సినిమాకు విశాల్ – శేఖర్ సంగీతం సమకూరుస్తున్నారు.

Related Stories: