పాకిస్థాన్‌ను గెలిపించిన షోయెబ్ మాలిక్

అబుదాబి: ఆసియా కప్ సూపర్ ఫోర్ మ్యాచ్‌లో.. పాకిస్థాన్ ఉత్కంఠభరిత విజయాన్ని నమోదు చేసింది. మరో మూడు బంతులు మిగిలి ఉండగా.. ఆఫ్ఘనిస్తాన్‌పై మూడు వికెట్ల తేడాతో నెగ్గింది. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షోయెబ్ మాలిక్.. ఈ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 43 బంతుల్లో 51 పరుగులు చేసి అతను నాటౌట్‌గా నిలిచాడు. షోయెబ్ మాలిక్ చాలా సమయస్ఫూర్తితో వత్తిడిలో తన ఇన్నింగ్స్‌ను ఆడాడు. చివరి ఓవర్‌లో 10 రన్స్ అవసరమైన సమయంలో.. మాలిక్ ఒక సిక్సర్, ఫోర్ కొట్టి.. పాక్ జట్టులో ఆశలు నింపాడు. 258 టార్గెట్‌తో బరిలోకి దిగిన పాకిస్థాన్ తొలి వికెట్‌ను త్వరగానే కోల్పోయింది. కానీ రెండవ వికెట్‌కు బాబర్ ఆజమ్, ఇమామ్ ఉల్ హక్‌లు 154 పరుగులు జోడించారు. ఆ తర్వాత ఆఫ్ఘన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ జోరుకు పాక్ త్వరత్వరగా వికెట్లను కోల్పోయింది. అయితే ఆ దశలో మాలిక్.. పరిణితి ఆటను ప్రదర్శించి పాక్‌కు విజయాన్నందించాడు.

Related Stories: