వాజ్‌పేయి ఆ రోజే ఎందుకు చనిపోయారు?

ముంబై: తన మాజీ మిత్రపక్షం బీజేపీపై శివసేన మరోసారి విరుచుకుపడింది. ఈసారి వాజ్‌పేయి మృతి చెందిన తేదీపై అనుమానం వ్యక్తంచేసింది. ఆగస్ట్ 16నే వాజ్‌పేయి మృతి చెందారా లేక ప్రకటన ఆ రోజు చేశారా అంటూ ఆ పార్టీ పత్రిక సామ్నా ఎడిటోరియల్‌లో ఎంపీ సంజయ్ రౌత్ సందేహం వ్యక్తంచేశారు. ప్రధాని మోదీ ఆగస్ట్ 15 ఎర్రకోట సందేశం కోసమే వాజ్‌పేయి మృతి ప్రకటనను ఆలస్యం చేశారా అని కూడా ఆయన ప్రశ్నించారు. అయితే తన అనుమానాలకు కారణాలను మాత్రం సంజయ్ చెప్పలేదు. ముందు మన ప్రజల కంటే ముఖ్యంగా స్వరాజ్యం అంటే ఏంటో మన పాలకులు తెలుసుకోవాలి. వాజ్‌పేయి ఆగస్ట్ 16న చనిపోయారు. అయితే ఆగస్ట్ 12-13 నుంచే ఆయన పరిస్థితి విషమించింది. అయితే స్వాతంత్య్ర దినోత్సవం నాడే పతకాన్ని అవనతం చేయడం, సంతాప దినాలు ప్రకటించడం, మోదీ ఎర్రకోట ప్రసంగాన్ని అడ్డుకోకుండా ఉండటం కోసం వాజ్‌పేయి ఆగస్ట్ 16నే ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోయారు లేక ఆయన చనిపోయినట్లు ప్రకటించారు అని ఎడిటోరియల్‌లో సంజయ్ రౌత్ అభిప్రాయపడ్డారు. స్వరాజ్యం అంటే ఏంటి అన్న శీర్షికతో ఆయన ఈ ఆర్టికల్ రాశారు. బీజేపీతో సంబంధాలు తెగిన తర్వాత ఆ పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నది శివసేన. అవకాశం దొరికినప్పుడల్లా విమర్శలు గుప్పిస్తున్నది.

× RELATED నెగేటివ్ రోల్ లో వరుణ్ తేజ్..?