ధైర్యాన్ని నూరిపోసిన శిఖ‌ర్ ధావ‌న్‌..

హైద‌రాబాద్‌: గాయ‌ప‌డ్డ శిఖ‌ర్ ధావ‌న్‌.. భార‌త అభిమానుల్లో మ‌నోధైర్యం నింపాడు. ఉర్దూ క‌వి రాహ‌త్ ఇందోరి రాసిన ఓ క‌విత‌ను త‌న ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశాడు. ఆస్ట్రేలియాతో జ‌రిగిన మ్యాచ్‌లో గాయ‌ప‌డ్డ ధావ‌న్‌.. వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో మూడు మ్యాచ్‌ల‌కు దూరం అయ్యాడు. అయితే దీంతో అధైర్య‌ప‌డే ప్ర‌స‌క్తే లేద‌న్న ఓ సందేశాన్ని త‌న ట్వీట్ ద్వారా వినిపించాడు. సోష‌ల్ మీడియా పేజీలో ప్రేర‌ణాత్మ‌క క‌విత‌ను ట్వీట్ చేశాడు. క‌బీ మెహ్‌కీ త‌ర‌హా గులోంసే ఉడ్‌తే హై అంటూ క‌విత‌ను వినిపించాడు. కొన్నిసార్లు మ‌నం పువ్వుల ప‌రిమ‌ళాల వ‌లే ఉంటాం.. కొన్ని సార్లు ప‌ర్వ‌త శ్రేణుల్లోని మంచు పొగ‌లా ఉంటాం.. మ‌న విహంగాల‌ను ఎవ్వ‌రూ క‌త్తిరించ‌లేర‌ని, ఎందుకంటే మేం ధైర్యంగా విహ‌రిస్తామ‌న్న క‌విత‌ను ధావ‌న్ ట్వీట్ చేశాడు. ధావ‌న్ స్థానంలో రిష‌బ్ పంత్ ఇంగ్లండ్‌కు ప‌య‌న‌మ‌య్యాడు. కివీస్‌, పాక్‌, ఆఫ్ఘ‌న్‌తో మ్యాచ్‌ల‌కు ధావ‌న్ దూరంకానున్నాడు.