స‌ల్మాన్ చిత్రంలో కాంగ్రెస్ ఎంపీ..!

కాంగ్రెస్ ఎంపీ శ‌శి థ‌రూర్ తన‌కి సల్మాన్ ఖాన్ సినిమాలో ఆఫ‌ర్ వ‌చ్చిన‌ విష‌యాన్ని ఓ ఇంట‌ర్వ్యూలో తెలియ‌జేశాడు. సోష‌ల్ మీడియా స్టార్ జానిస్ సీక్వెరాతో మాట్లాడుతూ .. ఓ గొప్ప సినిమా ఆఫ‌ర్ నా ద‌గ్గ‌ర‌కి వ‌చ్చింది. ఇందులో స‌ల్మాన్ భాగం అయినందుకు సంతోషంగా ఉంది. ఫేమ‌స్ డైరెక్ట‌ర్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నాడు. ఓ సీన్‌లో భారత విదేశాంగ మంత్రిగా కనిపించాలని వారు కోరగా, తాను ఈ పాత్ర చేసేందుకు ఉత్సాహప‌డ్డ‌ట్టు తెలిపారు. అయితే ఓ స్నేహితుడి సూచ‌న వ‌ల‌న వెన‌క్కి త‌గ్గిన‌ట్టు పేర్కొన్నారు. నువ్వు విదేశాంగ మంత్రిగా ప‌నిచేయాలంటే, సినిమాలో ఆ పాత్ర‌కి ఓకే చెప్పొద్ద‌ని స్నేహితుడు స‌ల‌హా ఇచ్చిన‌ట్టు తెలిపారు. ఇక అమీర్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌లు నటించిన అందాజ్‌ అప్నా అప్నా చిత్రంలో తాను క‌నిపించిన‌ట్టు వ‌చ్చిన వార్త‌ల‌ని కొట్టి పారేశారు శ‌శి థ‌రూర్‌. నేను చాలా భ‌య‌వంతుడిని. నేను యంగ్‌గా ఉన్న‌ప్పుడు ఆ సినిమా వ‌చ్చింది. కాని భారతీయ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మాత్ర‌మే సినిమా ఆఫర్లు రావ‌డం ప్రారంభం అయింది. నేను యువ‌త‌లో, అందంగా ఉన్నప్పుడు ఈ ఆఫ‌ర్స్ ఎందుకు రాలేదో అంటూ శ‌శి థ‌రూర్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.
× RELATED శృంగారానికి ఒప్పుకోలేదని ట్రాన్స్‌జెండర్‌పై కాల్పులు