బీసీఎఫ్‌సీ చైర్మన్‌గా శంభయ్య బాధ్యతల స్వీకరణ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా పూజార్ల శంభయ్య పదవీ బాధ్యతలు స్వీకరించారు. మాసబ్‌ట్యాంక్‌లోని సంక్షేమ భవన్లో బుధవారం బాధ్యతలు చేపట్టిన శంభయ్యను ఎంపీలు బూర నర్సయ్యగౌడ్, బడుగుల లింగయ్యయాదవ్, శాసనమండలి వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎమ్మెల్సీ పూల రవీందర్ తదితరులు అభినందించారు. అనంతరం శంభయ్య మాట్లాడుతూ బీసీలకు వందశాతం సబ్సిడీతో రుణాలు అందించడం కేసీఆర్ సర్కారుకే సాధ్యమైందని చెప్పారు.