ఒలింపియాడ్‌ లో నారాయణ సత్తా

హైదరాబాద్: ప్రతిష్ఠాత్మక 23వ అంతర్జాతీయ జూనియర్ ఆస్ట్రానమీ ఒలింపియాడ్, యూరోపియన్ గర్ల్స్ మ్యాథ్స్ ఒలింపియాడ్‌లో తమ స్కూళ్ల విద్యార్థులు సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పీ సింధూర నారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆస్ట్రానమీ ఒలింపియాడ్‌కు భారత్ నుంచి ముగ్గురు విద్యార్థులు ఎంపిక కాగా, వారిలో తమ స్కూల్ విద్యార్థులు వీ సాయితేజ ఒకటో ర్యాంకు, ఎం ఆదర్స్‌రెడ్డి రెండో ర్యాంకు సాధించారన్నారు. యూరోపియన్ గర్ల్స్ మ్యాథ్స్ ఒలింపియాడ్‌కు దేశం నుంచి ముగ్గురు విద్యార్థులు ఎంపికకాగా, వీరిలో నారాయణ విద్యార్థిని సాయి కీర్తన ఉన్నారన్నా రు. విద్యార్థులను నారాయణ విద్యాసంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కే పునిత్ అభినందించారు. ఆస్ట్రానమీ ఒలింపియాడ్-2018 అక్టోబర్ ఆరు నుంచి 14 వరకు శ్రీలంకలోని కొలంబోలో జరుగనున్నది. యూరోపియన్ గర్ల్స్ మ్యాథ్స్ ఒలింపియాడ్ ఉక్రేయిన్‌లోని కీవ్‌లో 2019 ఏప్రిల్‌లో నిర్వహిస్తారు.

Related Stories: