కోలీవుడ్‌లో సీక్వెల్స్ హ‌వా

టాలీవుడ్‌లో బాహుబ‌లి త‌ప్ప సీక్వెల్స్ స‌క్సెస్ సాధించిన దాఖ‌లాలు లేవు. కాని కోలీవుడ్‌లో మాత్రం వ‌రుస సీక్వెల్స్ నిర్మాణ ద‌శ‌లో ఉన్నాయి. శంక‌ర్ తెర‌కెక్కించిన‌ రోబో 2, విశాల్ సండైకోళీ 2 ( పందెం కోడీ 2) వంటి చిత్రాలు విడుద‌లకి సిద్ధం కాగా, భార‌తీయుడు 2 , మారి 2 చిత్రాలు త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ల‌నున్నాయి. సామికి సీక్వెల్‌గా తెర‌కెక్కి రీసెంట్‌గా విడుద‌లైన‌ సామి స్క్వేర్ ఘ‌న విజ‌యం సాధించింది. ఇప్పుడు ఇదే వ‌రుస‌లో త‌నీ ఒరువ‌న్ 2 చిత్రం కూడా చేరింది. 2015లో విడుద‌లైన ఈ చిత్రం త‌మిళంలో భారీ విజ‌యం సాధించింది. తెలుగులో రామ్ చ‌ర‌ణ్ హీరోగా ధృవ పేరుతో రీమేక్ కూడా అయింది. అయితే జ‌యం ర‌వి, అర‌వింద్ స్వామి, న‌య‌న తార ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన త‌నీ ఒరువ‌న్ చిత్రానికి మోహ‌న్ రాజా ఇప్పుడు సీక్వెల్ తీసే పనిలో ఉన్న‌ట్టు తెలుస్తుంది. తొలి పార్టులో జయంరవి పోలీస్‌ అధికారిగా, నయనతార ఫోరెన్సిక్‌ నిపుణురాలుగానూ నటించగా.. రెండో పార్టులోనూ వీరు అదే పాత్రల్లో నటించనున్నట్లు సమాచారం. అదనంగా సీక్వెల్‌లో మరో బ్యూటీ సాయోషా సైగల్‌ కూడా చేరనుందట. ఇక తొలిపార్ట్‌లో విల‌న్‌గా న‌టించి అద‌రగొట్టిన అర‌వింద స్వామి సెకండ్ పార్ట్‌లో ఎలా క‌నిపిస్తాడ‌నేది స‌స్పెన్స్. మ‌రి రానున్న రోజుల‌లో కోలీవుడ్ ప్రేక్ష‌కుల‌ని.. సీక్వెల్స్ ఎంత‌గా అలరిస్తాయో చూడాలి.

Related Stories: