నిజామాబాద్, మహబూబ్‌నగర్, వరంగల్ రూరల్ జిల్లాల్లో రోడ్డు ప్రమాదం..

హైదరాబాద్: ఇవాళ తెల్లవారుజామున రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదం జరిగింది. నిజామాబాద్ జిల్లా మెండోర మండలం బస్వాపూర్ వద్ద బైక్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు మహబూబ్‌నగర్ జిల్లా మాగనూరు మండలం నల్లగట్టు దగ్గర అదుపు తప్పి కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. కారు రాయచూర్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. వరంగల్ రూరల్ జిల్లాలోని రాయపర్తి శివారులో ఆర్టీసీ బస్సు టాటా ఏస్ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి.

Related Stories: