టెక్నికల్స్: ట్రెండ్ బేరిష్

నిఫ్టీ 11,000 స్థాయికి దిగువన ముగియడం ద్వారా మానసిక మద్ధతు స్థాయిని కూడా దిగపోయినట్టయింది. ఇప్పటికే 50 డీఎంఏకు దిగువన ట్రేడ్ అవుతూ ఉండగా 100 డీఎంఏ కూడా దిగిపోయి మధ్యకాలికి బేరిష్ ట్రెండ్‌ను ధృవీకరించింది. భారీ పతనం కారణంగా బేరిష్ బెల్ట్‌హోల్డ్ ప్యాట్రన్ ఏర్పడింది. దీనికి తోడు 43 ట్రేడింగ్ సెషన్ల తర్వాత మళ్లీ 11,000 స్థాయిని దిగిపోయింది. మేనెలలో వచ్చిన కనీస స్థాయి 9952 నుంచి జూలై 28 నాటి గరిష్ఠ స్థాయి 11,760 వరకు వచ్చిన ర్యాలీలో ఇప్పటివరకు 50 శాతం తగ్గిపోయింది. 61.8 శాతం రీట్రేస్ మెంట్ స్థాయి తో పాటు 200 డీఎంఏ వద్ద మద్దతు కనిపిస్తున్నది. మార్కెట్ ఓవర్ సోల్డ్ పొజీషన్‌లోకి వచ్చినందున ఇక నుంచి మార్కెట్ కన్సాలిడేట్ అవడానికే అవకాశాలు ఎక్కువ. మరో మూడు రోజుల్లో సెప్టెంబర్ డెరివేటివ్ సీరిస్ ముగస్తున్నందున షార్ట్ కవరింగ్ వచ్చే అవకాశం ఉంది. శుక్రవారం నాటి కనీస స్థాయిని దిగిపోనంతకాలం మార్కెట్‌లో బౌన్స్ రావడానికి అవకాశాలున్నట్టే. టెక్నికల్ ఇండికేటర్లు కూడా ఓవర్‌సోల్డ్ నుంచి ప్రయత్నం జరగడానికి అవకాశాలున్నట్టు సూచిస్తున్నాయి.

Related Stories: