నల్గొండ నవాబ్స్ జట్టుపై సికింద్రాబాద్ సూపర్ కింగ్స్ విజయం

హైదరాబాద్: తెలంగాణ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నీలో భాగంగా గురువారం జరిగిన తొలి మ్యాచ్ లో సికింద్రాబాద్ సూపర్ కింగ్స్ జట్టు నల్గొండ నవాబ్స్ జట్టుపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నల్గొండ జట్టు 134 పరుగులు చేయగా.. సికింద్రాబాద్ జట్టు లక్ష్యాన్ని సులభంగా చేధించింది. జట్టు తరపున తరణ్ జిత్ సింగ్ 41 పరుగులు సాధించి కీలక పాత్ర పోషించాడు. రెండో మ్యాచ్ లో రంగారెడ్డి రాయల్స్ జట్టు తన జైత్రయాత్ర కొనసాగిస్తూ డక్కన్ తందర్స్ జట్టుపై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రంగారెడ్డి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 173 పరుగులు చేసింది. జవాబుగా బ్యాటింగ్ చేసిన డక్కన్ తండార్స్ జట్టు 137పరుగులు మాత్రమే చేయగలిగింది.

Related Stories: