టోల్ ప్లాజా సిబ్బందిపై డ్రైవర్, కండక్టర్ దాడి.. వీడియో

హర్యానా : టోల్ ప్లాజా సిబ్బందిపై ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్ దాడి చేసిన హర్యానాలో చోటు చేసుకుంది. ఫరీదాబాద్‌లో ఉన్న టోల్ ప్లాజా వద్ద విధుల్లో ఉన్న సిబ్బందిపై డ్రైవర్, కండక్టర్ దాడి చేసిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఇద్దరూ కలిసి.. టోల్‌ప్లాజా సిబ్బందిని తన్నుతూ.. చితకబాదారు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Related Stories: