ఎస్సీ, ఎస్టీ చ‌ట్టంపై సుప్రీం తీర్పుకు విరుద్ధంగా..

న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని మార్చకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తులు మొదలుపెట్టింది. ఆ చట్టంలో ఉన్న కఠినతరమైన నిబంధనల్లో ఎటువంటి మార్పులు చేయకూడదని నిర్ణయించింది. దీని కోసం మళ్లీ ప్రత్యేకంగా పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తున్నది. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ.. దళిత సంఘాలు ఈనెల 9వ తేదీన భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్ర క్యాబినెట్.. ఎస్సీ,ఎస్టీ చట్టాన్ని యథావిధంగా ఉంచాలని నిర్ణయించింది. సుప్రీం చేసిన తప్పును సరిదిద్దేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తున్నది.
× RELATED టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వంగానే ఉంటది..