రోడ్డుపక్కకు దూసుకెళ్లిన స్కూల్ బస్సు

-పలువురు విద్యార్థులకు గాయాలు దంతాలపల్లి: మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం బొడ్లాడ గ్రా మ సమీపంలో సెయింట్ మేరీస్ హైస్కూల్‌కి చెంది న బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సు ముందు చక్రాలు ఊడిపోగా డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పక్కనే ఉన్న గుంతలో ఉన్న పెద్ద రాయిని ఆనుకుని నిలిచిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో క్లీనర్‌తోపాటు నర్సింహుల పేట మండలం కొమ్ములవంచ, బ్రాహ్మణకొత్తపల్లికి చెందిన 45 మంది పిల్లలు ఉన్నారు. ప్రమాదంలో పలువురికి స్వల్పగాయాలు కాగా చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు.