సౌదీ మ‌హిళ‌ల‌కు డ్రైవింగ్ లైసెన్సులు జారీ

రియాద్: సౌదీ అరేబియా మహిళలకూ ఇక డ్రైవింగ్ లైసెన్సులు వచ్చేశాయి. సోమవారం సుమారు 10 మంది మహిళలు డ్రైవింగ్ లైసెన్సు పొందారు. మూడు వారాల క్రితమే ఆ దేశ ప్రభుత్వం మహిళల డ్రైవింగ్‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. సుమారు 30 ఏళ్ల నుంచి అక్కడి మహిళలు తమకు డ్రైవింగ్ లైసెన్సు ఇవ్వాలంటూ ధర్నాలు, ఆందోళనలు నిర్వహిస్తూనే ఉన్నారు. అయితే తాజాగా డ్రైవింగ్ లైసెన్సు జారీ చేసిన పది మంది మహిళలకు విదేశాల్లోనూ ్రడ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉన్నారు. డ్రైవింగ్ టెస్ట్, కంటి పరీక్షల తర్వాత రియాద్‌లోని ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ ఈ లైసెన్సులను జారీ చేసింది.

Related Stories: