గుండెపోటుతో సర్పంచ్ మృతి

భీమారం : మంచిర్యాల జిల్లా భీమారం మండలం బూర్గుపల్లి గ్రామ సర్పంచ్ కొత్తకాపు తిరుపతి (48) గుండెపోటుతో మృతి చెందాడు. తిరుపతికి 9 గంటల ప్రాంతంలో తన నివాసంలో గుండెపోటురాగా కుటుంబ సభ్యులు మంచిర్యాల ఆసుపత్రికి తరలించే క్రమంలో మృతి చెందాడు. కాగా తిరుపతి స్వగ్రామం నెన్నెల మండలం ఆవుడం. అంత్యక్రియల కోసం మృతదేహన్ని అక్కడికే తరలించారు. తిరుపతికి భార్య అనసూయ కూతురు బిందు ఉన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీలో మొదటి నుంచి కొనసాగుతున్నాడు. భీమారం, జైపూర్ మండలాల ప్రజాప్రతినిధులు, అధికారులు, పలువురు సర్పంచ్‌ మృతి పట్ల సంతాపం ప్రకటించారు.

Related Stories: