ఫినాలేకి చేరుకున్న కంటెస్టెంట్ ఎవ‌రో తెలుసా

బిగ్ బాస్ సీజ‌న్ 2 కార్య‌క్ర‌మం తుది ద‌శ‌కు చేరుకోవ‌డంతో ఇంటి స‌భ్యులు త‌మ ఆటల‌తో ప్రేక్ష‌కులని ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేస్తున్నారు. మూడు రోజులుగా హీటెక్కిన బిగ్ బాస్ హౌజ్‌ ఎపిసోడ్ 103లో కాస్త చ‌ల్ల‌బ‌డిన‌ట్టు క‌నిపించింది. బిగ్ బాస్ ఫినాలే రేస్ టుకి చేరుకునేందుకు సామ్రాట్‌, రోల్ రైడాల‌కి మీ గుడ్డు జాగ్ర‌త్త అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్ . ఈ టాస్క్‌లో బిగ్ బాస్ ఆ ఇద్ద‌రి కంటెస్టెంట్స్‌కి బౌల్ లో కోడిగుడ్లు ఇచ్చారు. బౌల్‌లో ఉన్న కోడిగుడ్ల‌ని గేమ్‌లో పాల్గొన్న‌ ఇద్ద‌రు స‌భ్యులు ప‌గ‌ల‌గొట్ట‌కుండా చూసుకోవాలి. టాస్క్‌లో భాగంగా మిగ‌తా ఇంటి స‌భ్యులు ఒక‌రికి మ‌ద్ద‌తు తెలుపుతూ మ‌రొక‌రివి ప‌గ‌ల‌గొట్టొచ్చ‌ని అన్నారు. చివరిగా ఎవరి బౌల్‌లో ఎక్కువ గుడ్లు పగలకుండా ఉంటాయో వాళ్లే డైరెక్ట్‌గా ఫినాలేకి వెళ్తారంటూ బిగ్ బాస్ ఈ టాస్క్ ఇచ్చారు . టాస్క్ ప్రారంభం కాగానే రోల్‌, సామ్రాట్‌లు జైలులోకి వెళ్ళి తాళం వేసుకున్నారు. బిగ్ బాస్ హెచ్చ‌రిక‌ల‌తో బ‌య‌ట‌కి వ‌చ్చారు. రోల్ కిచెన్ రూంలో ఉన్న క‌ప్ బోర్డ్స్‌లో దాక్కుంటే సామ్రాట్ స్విమ్మింగ్ పూల్ కార్న‌ర్‌లో నిలుచొని త‌న‌కి ఇచ్చిన ఎగ్స్ కాపాడుకున్నాడు. సామ్రాట్‌కి త‌నీష్‌, దీప్తి, గీతా మాధురి స‌పోర్ట్ చేయ‌గా రోల్‌కి కౌశ‌ల్ అండ‌గా నిలిచాడు. రోల్ ద‌గ్గ‌ర ఉన్న గుడ్ల‌ని ప‌గ‌ల‌గొట్టేందుకు త‌నీష్‌, గీతా, దీప్తిలు చాలా ప్ర‌య‌త్నించగా కొంత వ‌ర‌కు వారిని కౌశ‌ల్ అడ్డుకున్నాడు. కాని బెడ్ రూంలోకి వెళ్ళిన త‌ర్వాత అంద‌రు ఒకే సారి రోల్‌పై ఎటాక్ చేయ‌డంతో ఆయ‌న చేతిలో ఉన్న గుడ్లు అన్ని ప‌గిలిపోయాయి. దీంతో రోల్‌, కౌశ‌ల్‌లు సామ్రాట్ బౌల్‌లో ఉన్న ఎగ్స్ ని పగుల‌గొట్టేందుకు ప్ర‌య‌త్నించారు. చివ‌రి వ‌ర‌కు పోరాడ‌దామ‌ని కౌశ‌ల్ అంటుకున్న కూడా తన గుడ్లు ఎలాగూ కింద పడిపోయాయి కాబట్టి సామ్రాట్ గుడ్లును పగలగొట్టలేమని.. అతన్నే విన్ కానివ్వ‌మంటూ చేతులెత్తేశాడు రోల్ రైడా. నీకు సపోర్ట్ చేస్తూ ఇంత రిస్క్ చేస్తే నువ్వు ఇలా అన‌డం ఏం బాలేదు అని కౌశ‌ల్ అన్నాడు. నీకు సామ్రాట్ గెల‌వాల‌ని ఉందని చెపితే నేను డ్రాప్ అవుతాన‌ని కౌశ‌ల్ అన‌గా,రోల్ అవున‌నే స‌మాధానం ఇచ్చాడు. దీంతో కౌశ‌ల్ డ్రాప్ కాగా, సామ్రాట్ చాలా ఎమోష‌న‌ల్ అయ్యాడు. అంద‌రిని హ‌గ్ చేసుకొని క‌న్నీటి పర్యంతం అయ్యాడు సామ్రాట్. టైటిల్ రాక‌పోయిన ప‌ర్వాలేదు. అక్క‌డి వ‌ర‌కు చేరుకున్నందుకు సంతోషంగా ఉంద‌ని సామ్రాట్ స్ప‌ష్టం చేశాడు. మొత్తానికి బిగ్ బాస్ ఇచ్చిన మీ గుడ్డు జాగ్ర‌త్త అనే టాస్క్‌లో సామ్రాట్ గెలుపొంద‌డంతో ఈ వారం ఎలిమినేష‌న్ నుండి మిన‌హాయింపు పొంద‌డమే కాక బిగ్ బాస్ ఫినాలే రేస్ 2కి చేరుకున్న తొలి కంటెస్టెంట్‌గా సామ్రాట్ ఎంపిక‌య్యాడు. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ ఇంటి స‌భ్యుల‌కి టాస్క్ ఇచ్చారు. ఇందులో ఇంటి స‌భ్యులు మూడు గ్రూపుల‌గా విడిపోయి ప్ర‌క‌ట‌న చేయాల‌ని అన్నారు. ఈ ప్ర‌క‌ట‌న ఫన్నీగా ఉండాల‌ని అన్నారు. ముందుగా సామ్రాట్‌, దీప్తిలు త‌మ స్టైల్‌లో యాడ్‌ని ప్ర‌మోట్ చేయ‌గా ఆ త‌ర్వాత త‌నీష్‌, రోల్‌లు వ‌చ్చారు. చివ‌ర‌కి కౌశ‌ల్‌, గీతా మాధురిలు ప్ర‌క‌ట‌న కోసం భార్య భ‌ర్త‌లుగా మారి స్కిట్‌ని ర‌క్తి క‌ట్టించారు. దీంతో వారిద్ద‌రిని బిగ్ బాస్ టాస్క్ విజేత‌లుగా ప్ర‌క‌టించారు. అంతేకాదు ప్ర‌క‌ట‌న కోసం వాడిన వ‌స్తువుల‌ని వారి ఇంటికి కూడా పంపిస్తామ‌ని తెలిపారు. దీంతో కౌశ‌ల్, గీతా మాధురి తెగ సంబ‌ర‌ప‌డిపోయారు.

Related Stories: