హైదరాబాద్ చాంప్ సమీర్‌వర్మ

హైదరాబాద్: హైదరాబాద్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో సమీర్‌వర్మ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో సమీర్ 21-15, 21-18తో సూంగ్‌జువెన్(మలేషియా)పై గెలిచాడు. ఆది నుంచే దూకుడు కనబరిచిన సమీర్..మెరుపు స్మాష్‌లకు తోడు డ్రాప్‌షాట్లు, నెట్‌గేమ్‌తో ప్రత్యర్థిని వరుస సెట్లలో ఓడించి స్వర్ణపతకాన్ని దక్కించుకున్నాడు. మిక్స్‌డ్ డబుల్స్‌లో సిక్కీరెడ్డి, ప్రణవ్ జెర్రీ చోప్రా ద్వయం 15-21, 21-19, 25-23తో ఆరోసీడ్ మలేషియా జోడీ అక్బర్ బింటాంగ్, విన్నీ ఒక్టీవినాపై విజయం సాధించింది. మరోవైపు పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్, చిరాగ్‌శెట్టి జోడీ 21-16, 21-14తో మూడో సీడ్ ఇండోనేషియా ద్వయం అక్బర్ బింటాంగ్, మోహ్ రెజాపై గెలిచింది.

Related Stories: