'గీత గోవిందం'సంబరాల్లో భాగమైనందుకు సంతోషం: సమంత

విజయ్ దేవరకొండ, రష్మిక ప్రధాన పాత్రలలో పరశురాం తెరకెక్కించిన చిత్రం గీత గోవిందం. ఆగస్ట్ 15న విడుదలైన ఈ చిత్రం ఇంటా బయట రచ్చ చేస్తుంది. ఓవర్సీస్ లోను ఈ మూవీ భారీగా వసూళ్లు రాబడుతుంది. గీత గోవిందం థియేటర్స్ దగ్గర హౌజ్ ఫుల్ బోర్డ్స్ ప్రత్యక్షమవుతున్నాయంటే ఈ సినిమాకి లభిస్తున్న ఆదరణ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిరంజీవి, రాజమౌళి, మహేష్ బాబు తదితరులు సినిమాపై ప్రశంసలు కురిపించారు. మహానటి చిత్రంలో విజయ్ దేవరకొండతో కలిసి నటించిన సమంత గీత గోవిందం చిత్రంపై ప్రశంసలు కురిపించింది. గీత గోవిందం సినిమా చూసాను. విజయ్ దేవరకొండ, రాహుల్ రామకృష్ణ ఉంటే ఏ సినిమా అయిన చూస్తాను. రష్మిక, వెన్నెల కిషోర్ తో పాటు చిత్ర బృందానికి నా అభినందనలు అని సమంత ట్వీట్ లో తెలిపింది. సామ్ ట్వీట్ ని రీ ట్వీట్ చేసిన విజయ్.. సమంతతో ఉన్న టపాసుల డబ్బాని షేర్ చేస్తూ.. నా అభిమాన నటి సమంత వెలుగులతో సంబరాలు మొదలయ్యాయి అని ట్వీట్ లో తెలిపాడు. విజయ్ కి ట్వీట్ కి సామ్ స్పందిస్తూ.. సంబరాలలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందని ట్వీట్ చేసింది. మహానటి చిత్రంలో సమంత, విజయ్ దేవరకొండ జర్నలిస్టులుగా కనిపించిన విషయం విదితమే.
× RELATED తొలి టీ20లో పోరాడి ఓడిన టీమిండియా