స‌మంత ఫేవ‌రేట్ సాంగ్‌.. ‘ఎంత సక్కగున్నావే’..

చెన్నై బ్యూటీ స‌మంత న‌టించిన తాజా చిత్రం రంగ‌స్థలం. రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌లో సుకుమార్ తెర‌కెక్కించిన ఈ చిత్రం ఇటీవ‌లే షూటింగ్ పూర్తి చేసుకొని ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. మార్చి 30న విడుద‌ల కానున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కు ఫ‌స్ట్ లుక్‌, చ‌ర‌ణ్, స‌మంత‌ల‌ పాత్రకి సంబంధించిన టీజ‌ర్స్ విడుద‌ల‌య్యాయి. రెండు టీజ‌ర్స్‌కి ఊహించని రీతిలో ఆద‌ర‌ణ ల‌భించింది. చిట్టి బాబు పాత్ర‌లో రామ్ చ‌ర‌ణ్ చెవిటి వ్య‌క్తిగా క‌నిపించ‌నుండ‌గా, స‌మంత మూగ‌మ్మాయిగా రామ‌ల‌క్ష్మి పాత్ర‌లో న‌టించిన‌ట్టు తెలుస్తుంది. రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో సుకుమార్ త‌న సినిమాకి మ‌రింత ఆద‌ర‌ణ ల‌భించేలా వ్యూహాలు రచిస్తున్నాడు. ఈ రోజు సాయంత్రం సినిమాలోని తొలి సాంగ్ విడుద‌ల చేయ‌నున్నాడు. ‘ఎంత సక్కగున్నావే’.. అంటూ సాగే ఈ పాట రంగ‌స్థ‌లంలో త‌న ఫేవ‌రేట్ సాంగ్ అంటుంది స‌మంత‌. సాయంత్రం 5 గంట‌ల‌కు విడుద‌ల కానున్న ఈ సాంగ్ ఎంత బ‌జ్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
× RELATED కాంగ్రెస్, పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్.. పుట్టుకొచ్చిన కొత్త పొత్తు!