ద్వితీయార్ధంలో ఓ సినిమా షూటింగ్ పూర్తి చేసిన సామ్‌

ఈ ఏడాది ప్ర‌థ‌మార్దంలో వ‌రుస సినిమాల‌తో బిజీ అయిన స‌మంత మంచి హిట్స్ సాధించింది. రంగస్థలంలో రామలక్ష్మీగా, మహానటిలో మధురవాణిగా, అభిమన్యుడు చిత్రంలో రతీ దేవిగా అద్భుత పాత్రలు పోషించి అలరించింది. అయితే సమంత తొలిసారి డీ గ్లామర్ పాత్ర పోషించిన రామలక్ష్మీ పాత్రకి మాత్రం ఎక్కువ మార్కులు పడ్డాయి. ప్రస్తుతం సూపర్ డీలక్స్, సీమ రాజా అనే తమిళ చిత్రాలతో బిజీగా ఉంది. చైతూ ప్రధాన పాత్రలో శివ నిర్వాణ తెర‌కెక్కిస్తున్న సినిమా కూడా చేస్తుంది సామ్. ఇదీ కాక యూ టర్న్ అనే రీమేక్ చిత్రం కూడా చేస్తుంది.

ఫ‌స్టాఫ్‌లో మంచి విజ‌యాలు సాధించిన స‌మంత సెకండాఫ్‌లో ఓ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. విజ‌య్ సేతుప‌తి, ఫాహ‌ద్ ఫాజిల్‌, మిస్కిన్‌, ర‌మ్య కృష్ణ‌, మిర్నాలిని ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కుతున్న క్రైమ్ థ్రిల్ల‌ర్ చిత్రం సూప‌ర్ డీల‌క్స్‌. థైగ‌రాజ‌న్ కుమార‌రాజా ఫేం ఆర‌ణ్య‌కాందం ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో స‌మంత పార్ట్‌కి సంబంధించిన షూటింగ్ పూర్తైంద‌ట‌. ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ సామ్‌తో కేక్ క‌ట్ చేయించి సెండాఫ్ ఇచ్చారు. ఈ చిత్రానికి యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం అందిస్తుండ‌గా, నిరవ్ షా మ‌రియు వినోద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఈ సినిమా తప్ప‌క విజ‌యం సాధిస్తుంద‌నే ఆశలో టీం ఉంది. త్వ‌ర‌లోనే విడుద‌ల కానున్న ఈ చిత్రం స‌మంత‌కి మ‌రో విజ‌యాన్ని అందించాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు.

× RELATED నారాయ‌ణ‌పేట్‌లో ఆధిపత్య పోరు..!