లొకేషన్‌లో తల్లితో సల్మాన్‌ఖాన్..ఫొటో వైరల్

బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్ ప్రస్తుతం భారత్ చిత్రంతో బిజీగాబిజీగా ఉన్న విషయం తెలిసిందే. భారత్ షూటింగ్ ఉత్తరాఫ్రికా తీరం, సిసిలీ ప్రాంతాల మధ్య ఉన్న మాల్టాలో జరుగుతుంది. షూటింగ్‌తో తీరకలేకుండా ఉండే సల్మాన్ మాల్టాకు తన కుటుంబసభ్యులను వెంటపెట్టుకెళ్లాడు. మాల్టాలోని లొకేషన్‌లో తన తల్లి సల్మాఖాన్‌తో కలిసి దిగిన ఫొటోతోపాటు విత్ లవ్ ఆఫ్ మై లైఫ్ అనే క్యాప్షన్ పెట్టాడు సల్మాన్‌ఖాన్. తల్లితో కండలవీరుడు దిగిన ఫొటో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. సల్మాఖాన్ తన సోదరి అల్విరా అగ్నిహోత్రి, మరిది అతుల్ అగ్నిహోత్రితో కలిసి మాల్టాకు వెళ్లింది.

× RELATED ఒంటిపై కిరోసిన్ పోసుకొని మహిళ ఆత్మహత్య