మాల్టా షూట్‌లో సల్మాన్ టీం..ఫొటోలు, వీడియో వైరల్

ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ భారత్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అలీ అబ్బాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. భారత్ షూటింగ్ ఇప్పటికే పలు లొకేషన్లలో జరిగింది. తాజాగా మాల్టా షూటింగ్ షెడ్యూల్‌లో సల్మాన్‌తోపాటు చిత్రయూనిట్ పాల్గొన్నది.

మాల్టా షూటింగ్‌లో ఉన్న సల్మాన్‌ఖాన్, అలీ అబ్బాస్ జాఫర్ ఫొటోలు, లొకేషన్‌లో సల్మాన్‌ఖాన్ తిరుగుతున్న వీడియో వైరల్‌గా మారాయి. ఈ సినిమాలో సల్మాన్‌కు జోడీగా కత్రినాకైఫ్ నటిస్తోంది. టైగర్ జిందా హై చిత్రం తర్వాత అలీ అబ్బాస్, సల్మాన్, కత్రినా కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రమిది. ఉత్తరాఫ్రికా తీరం, సిసిలీ ప్రాంతాల మధ్య మాల్టా ఉంది.

Related Stories: