నా బంధం ఈ నేలతోనూ.. రక్తంతోనూ.. టీజర్ అదిరింది

భారత 72వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సల్మాన్‌ఖాన్ తన లేటెస్ట్ మూవీ భారత్ టీజర్ రిలీజ్ చేశాడు. ఇండియన్ మ్యాప్‌ను చూపిస్తూ బ్యాక్‌గ్రౌండ్‌లో సల్మాన్ చెప్పే ఎమోషనల్ డైలాగ్‌తో టీజర్ సాగిపోతుంది. సినిమాలో ఏం ఉండబోతున్నదో ఇదొక్క డైలాగ్‌తోనే డైరెక్టర్ చెప్పేశాడు. కొన్ని బంధాలు రక్తంతో ఉంటాయి.. మరికొన్ని నేలతో ఉంటాయని నా తండ్రి చెబుతూ ఉండేవాడు.. కానీ నా దగ్గర మాత్రం ఈ రెండూ ఉన్నాయి అని సల్మాన్ చెప్పే డైలాగ్‌తో టీజర్‌ను రూపొందించారు. సౌత్ కొరియా మూవీ ఓడ్ టు మై ఫాదర్ అనే సినిమా ఆధారంగా తెరకెక్కుతున్నది. ఈ సినిమాలో సల్మాన్‌తోపాటు కత్రినా కైఫ్, దిశా పటానీ, సునీల్ గ్రోవర్, ఆసిఫ్ షేక్, టబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 1940లలో దేశంలోని పరిస్థితుల ఆధారంగా భారత్‌ను తెరకెక్కిస్తున్నారు. దేశ విభజనతో పాటు ఆ తర్వాత 70 ఏళ్లలో జరిగిన పరిణామాలను కూడా మూవీలో చూపించబోతున్నారు. సల్మాన్, జాఫర్ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ సినిమా ఇది. గతంలో సుల్తాన్, టైగర్ జిందా హైలాంటి సూపర్‌హిట్ మూవీస్ వీళ్ల కాంబినేషన్‌లో వచ్చిన విషయం తెలిసిందే.

Related Stories: