జూలై 9న రాబోతున్న శైల‌జా రెడ్డి అల్లుడు

పెళ్ళి త‌ర్వాత సినిమాల స్పీడ్ పెంచిన నాగ చైత‌న్య ప్ర‌స్తుతం చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో స‌వ్య‌సాచి సినిమా చేస్తున్నాడు. మ‌రోవైపు మారుతి ద‌ర్శ‌క‌త్వంలో శైలజా రెడ్డి అల్లుడు అనే చిత్రంతోను బిజీగా ఉన్నాడు. వీటితో పాటు శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో సామ్‌తో క‌లిసి ఓ మూవీ చేస్తున్నాడు. త్వ‌ర‌లో బాబీ ద‌ర్శ‌క‌త్వంలో మ‌ల్టీ స్టారర్ మూవీ చేయ‌నున్నాడు. చైతూ చేస్తున్న ఈ సినిమాల‌పై అభిమానుల‌లో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అయితే ప్ర‌స్తుతం స‌వ్య‌సాచి, శైల‌జా రెడ్డి అల్లుడు చిత్ర షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకోగా ఈ రెండు చిత్రాలు ఆగ‌స్ట్‌లో విడుద‌ల కానున్న‌ట్టు తెలుస్తుంది. మారుతి ద‌ర్శ‌క‌త్వంలో చైతూ చేస్తున్న చిత్రం ఎలా ఉంటుంది అనే దానిపై అభిమానుల‌లో చాలా ఆస‌క్తి నెల‌కొంది. ఈ సినిమాలో అత్త పాత్రలో సీనియర్‌ నటి రమ్యకృష్ణ నటిస్తున్నారు. అను ఎమ్మాన్యుయేల్ కథానాయికగా న‌టిస్తుంది. మూవీ ఫ‌స్ట్ లుక్ ని జూలై 9న విడుద‌ల చేస్తున్న‌ట్టు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ప్రేమమ్, బాబు బంగారం వంటి చిత్రాలు నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్స్ శైల‌జా రెడ్డి అల్లుడు చిత్రాన్ని రూపొందిస్తుంది.

Related Stories: