పవర్‌ఫుల్ సామి

విక్రమ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా తమిళ చిత్రం సామీ స్కేర్. 2003లో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సామి చిత్రానికి సీక్వెల్ ఇది. హరి దర్శకుడు. కీర్తి సురేష్ కథానాయిక. పుష్యమి ఫిలిం మేకర్స్, ఎమ్.జి.ఔరా సినిమాస్ పతాకాలపై బెల్లం రామకృష్ణారెడ్డి, కావ్య వేణుగోపాల్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. సెన్సార్‌కు సిద్ధంగా ఉంది. ఈ నెల మూడోవారంలో విడుదల చేయబోతున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ఈ సినిమాలో విక్రమ్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారు. సంఘ విద్రోహక శక్తులపై ఆయన చేసే పోరాటం స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. మాస్, యాక్షన్, సెంటిమెంట్ అంశాల కలబోతగా ఆకట్టుకుంటుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం ప్రత్యేకాకర్షణగా నిలుస్తుంది. భారీ స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. ఐశ్వర్యరాజేష్, బాబీసింహా, ప్రభు తదితరులు ఇతర తారాగణం.