లీగ‌ల్ చిక్కుల‌తో ఆగిన సాక్ష్యం షోలు..!

శ్రీవాస్ ద‌ర్శ‌క‌త్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, పూజా హెగ్డే ప్ర‌ధాన పాత్ర‌లుగా తెర‌కెక్కిన చిత్రం సాక్ష్యం. యాక్ష‌న్ ఫాంట‌సీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం నేడు ప్ర‌పంచ వ్యాప్తంగా విడుదల అవుతుంద‌ని నిర్మాత‌లు కొద్ది రోజులుగానే ప్ర‌క‌టించారు. అయితే నిర్మాత అభిషేక్ నామా, ఫైనాన్షియ‌ర్స్ మ‌ధ్య త‌లెత్తిన వివాదాల కార‌ణంగా మార్నింగ్ షో ప‌డ‌నట్టు తెలుస్తుంది. ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు కూడా రద్దయ్యాయి. ఇంకా తెలుగు రాష్ట్రాల‌లో ఏ థియేట‌ర్‌కి డిజిటల్ ప్రింట్ అంద‌క‌పోవ‌డం విశేషం. మ‌రి మ్యాట్నీ స‌మ‌యం వ‌ర‌కైన స‌మ‌స్యని సాల్వ్ చేసి షోలు ప్ర‌ద‌ర్శించాల‌ని నిర్మాత‌లు ప్ర‌య‌త్నిస్తున్నార‌ట‌. 40 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ చిత్రం సాంగ్స్, ట్రైల‌ర్, టీజ‌ర్స్ అభిమానుల‌కి న‌చ్చ‌డంతో మూవీపై అభిమానులు భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు. అయితే సినిమా ఆగిపోయింద‌నే విష‌యం తెలుసుకున్న అభిమానులు నిరూత్సాహానికి గురైన‌ట్టు తెలుస్తుంది. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి విజయవంతమైన సినిమాలు తెర‌కెక్కించిన శ్రీ వాస్ ఈ సినిమాతో హ్యాట్రిక్ కొడ‌తాడా అని ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఓవర్సీస్‌లో చిత్రానికి సంబంధించి ప్రీమియర్ షోలు ప్రదర్శితం కాగా , నెటిజ‌న్స్ సినిమాపై పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు.

× RELATED డీకే అరుణ వర్సెస్ జైపాల్ రెడ్డి