శ్రీవారిని ద‌ర్శించుకున్న సాక్ష్యం చిత్ర బృందం

సాక్ష్యం చిత్ర బృందం తిరుమల శ్రీవారిని కొద్ది సేప‌టి క్రితం ద‌ర్శించుకుంది. ఈ రోజు ఉదయం విఐపీ విరామ సమయంలో చిత్ర హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌, న‌టి పూజా హెగ్డే, నిర్మాత అభిషేక్ నామ‌లు స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. టీటీడీ అధికారులు వీరికి దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వీరికి వేదపండితులచే ఆశీర్వచనం అందించి, స్వామివారి తీర్ధప్రసాదాలు, పట్టు వస్త్రాలను అందజేశారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో సీనియర్‌ నిర్మాత అశ్వినీదత్‌ కూడా స్వామివారిని దర్శించుకున్నారు. సాక్ష్యం చిత్రం రేపు విడుద‌ల కానున్న నేప‌థ్యంలో వీరు శ్రీ వారిని ద‌ర్శించుకున్నారు. అంత‌క‌ముందు స్పెష‌ల్ చార్ట‌ర్డ్ ఫ్లైట్‌లో వీరు తిరుప‌తికి వెళ్ళారు. శ్రీవాస్ డైరెక్షన్‌లో తెర‌కెక్కుతున్న సాక్ష్యం చిత్రంలో శ‌రత్‌కుమార్, జగపతిబాబు, మీన, వెన్నెలకిశోర్, అశుతోష్ రానా, జయప్రకాశ్ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమా మంచి హిట్ అవుతుంద‌ని టీం భావిస్తుంది.

× RELATED నాటు తుపాకీ స్వాధీనం: ఇంజినీరింగ్ విద్యార్ధి అరెస్టు