క్రికెట్లోకి శ్రీశాంత్ రీఎంట్రీ..!

తిరువనంతపురం: ఐపీఎల్ స్ఫాట్ ఫిక్సింగ్ ఉదంతంలో జైలుకు వెళ్లొచ్చిన కేరళ స్పీడ్‌స్టర్ శ్రీశాంత్ చాలా రోజుల పాటు క్రికెట్ ఆటకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అతడు మళ్లీ అధికారిక మ్యాచ్‌లు ఆడేందుకు బీసీసీఐ అనుమతించట్లేదు. ఈ నేపథ్యంలో సినీ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఇక క్రికెట్‌కు వీడ్కోలు పలికినట్లే అనుకుంటున్న తరుణంలో మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తాజాగా శ్రీశాంత్ గురువారం మ్యాచ్ ఆడిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ సందర్భంగా అతడు బౌలింగ్ కూడా చేశాడు. 35ఏళ్ల శ్రీశాంత్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. ఒకవేళ బీసీసీఐ అతనిపై నిషేధాన్ని ఎత్తివేసినా ప్రస్తుత భారత బౌలింగ్ దళం పటిష్ఠంగా ఉన్న నేపథ్యంలో చోటు దక్కడం కష్టమే. ఐతే విదేశాల్లో జరిగే టీ20 టోర్నీల్లో ఆడేందుకు అతడికి అవకాశాలు మెరుగ్గానే ఉన్నాయి. భవిష్యత్‌లో మరికొన్నేళ్ల పాటు క్రికెట్ ఆడేందుకు శ్రీశాంత్ సాధన చేస్తున్నట్లు తెలిసింది.

#discipline #Cricket

A post shared by Sree Santh (@sreesanthnair36) on

Related Stories: