ప్రవాస భారతీయులకు రైతుబంధు పథకం వర్తింపు

హైదరాబాద్: రైతుబంధు పథకాన్ని ప్రవాస భారతీయులకు వర్తింప చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి పంటకు ఎకరానికి రూ.4వేలు చెల్లించేందుకు సర్కారు నిర్ణయించింది. ఖరీఫ్ సీజన్‌లో భూమి యజమాని విదేశాలకు వెళ్లడంతో ఆ చెక్కులు పంపిణీ చేయకుండా నిలిచిపోయాయి. వాటిని ప్రవాస భారతీయుల విజ్ఞప్తి మేరకు వారి కుటుంబ సభ్యులకు ఇవ్వనున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారధి తెలిపారు.

విదేశాల్లో ఉన్న రైతు భార్య లేదా భర్త ఇక్కడ ఉన్నట్లయితే వారికి ఇస్తారు. ఒకవేళ భార్య లేదా భర్త ఇక్కడ లేకుంటే 18 ఏళ్లు పైబడిన వారి పిల్లలకు ఇస్తారు. వారెవరూ ఇక్కడ లేకుంటే సంబంధిత ఎన్‌ఆర్‌ఐ తల్లిదండ్రులకు అందజేస్తారు. ఆయా వివరాలపై స్థానిక వ్యవసాయాధికారులకు విచారణ జరిపి పూర్తిస్థాయిలో సంతృప్తి చెందాక సంబంధిత కుటుంబ సభ్యులకు చెక్కులు అందజేస్తారు. ఈ మార్గదర్శకాలు కేవలం ఎన్‌ఆర్‌ఐలకే వర్తిస్తుందని, దేశంలో ఇతర ప్రాంతాల్లో ఉన్న వారికి వర్తించదని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారధి వెల్లడించారు.

Related Stories: