ఈ నెల 25 వరకు కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం..

ఖమ్మం : ఈ నెల 25వ తేదీ వరకు కొత్త ఓటరు నమోదు ప్రక్రియ కొనసాగుతుందని ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ తెలిపారు. ఇవాళ ఖమ్మం జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటరు నమోదు ప్రక్రియపై కలెక్టర్ ఆర్.వి కర్ణన్ అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు.

కొత్త ఓటరు నమోదు, మరణించిన వారి ఓటు తొలగింపు, మార్పులు- చేర్పులు వంటి వాటికోసం ఆయా నియోజకవర్గ పోలింగ్ బూత్ లకు కేటాయించిన అధికారులను సంప్రదించాలని ఈ సమావేశంలో కలెక్టర్ సూచించారు. ఓటరు నమోదుకు సెప్టెంబర్ 25 వరకు గడువు తేదీగా నిర్ణయించామని చెప్పారు. అక్టోబర్ 4 వ తేదీ నుంచి సవరణలు చేసి తుది ఓటరు జాబితాను అక్టోబర్ 8వ తేదీన విడుదల చేస్తామన్నారు. 18 సంవత్సరాలు నిండిన యువత ప్రతి ఒక్కరూ ఓటర్ నమోదు అవకాశాన్నిసద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కర్ణన్ కోరారు.

Related Stories: