మంత్రి ల‌క్ష్మారెడ్డికి మెజార్టీ రావాలని పాదయాత్ర

జడ్చర్ల: రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, జడ్చర్ల టీఆర్‌ఎస్ అభ్యర్థి డా.ల‌క్ష్మారెడ్డి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో భారీ మెజార్టీతో గెలుపొందాలని కోరుతూ మహబూబ్‌నగర్ జిల్లా బాదేపల్లి పట్టణంలోని నిమ్మబావి గడ్డ ప్రాంతానికి చెందిన యువకులు శ్రీనివాస్, దాస్‌నాయక్‌లు పాదయాత్ర చేపట్టారు. బాదేపల్లి పట్టణంలోని బంగారు మైసమ్మ ఆలయంలో ఇవాళ ఉదయం ప్రత్యేక పూజలు చేసిన యువకులు అనంతరం ఫత్తేపూర్ మైసమ్మ ఆలయం వరకు పాదయ్రాత చేపట్టారు. జడ్చర్ల నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ల‌క్ష్మారెడ్డి ముందుకు తీసుకోవడంతో పాటు రాష్ట్రంలో నిరుపేదలకు సైతం కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందించేందుకు ఎంతో కృషి చేశారన్నారు.