రెండ‌వ రోజూ త‌న్నుకున్న ఎంపీలు - వీడియో

కొలంబో : శ్రీలంక పార్ల‌మెంట్‌లో రెండ‌వ రోజు కూడా ఎంపీలు త‌న్నుకున్నారు. వివాదాస్ప‌ద‌ ప్ర‌ధాని రాజ‌ప‌క్సే మ‌ద్ద‌తుదారులు.. స్పీక‌ర్ జ‌య‌సూర్య సీట‌ను ఆక్ర‌మించారు. స‌భ‌లో విధులు నిర్వ‌హిస్తున్న పోలీసుల‌పైన కూడా విరుచుకుప‌డ్డారు. కారం పొడిని కూడా ఎంపీలు చ‌ల్లుకున్నారు. దేశానికి స్పీక‌ర్ లేరు.. ప్ర‌భుత్వం లేద‌ని గురువారం స్పీక‌ర్ ప్ర‌క‌టించారు. దీంతో రెండు వ‌ర్గాల‌కు చెందిన ఎంపీలు కొట్టుకున్నారు. బ‌ల‌ప‌రీక్ష‌ను త‌ప్పుప‌డుతూ ఎంపీలు బాహాబాహీకి దిగారు. గురువారం నిర్వ‌హించ‌లేక‌పోయిన విశ్వాస‌ప‌రీక్ష‌ను ఇవాళ నిర్వ‌హించాల‌నుకున్నారు. కానీ రాజ‌ప‌క్సే, విక్ర‌మ‌సింఘే వ‌ర్గ ఎంపీలు త‌న్నుకోవ‌డంతో విశ్వాస ప‌రీక్ష జ‌ర‌గ‌లేదు. పార్ల‌మెంట్‌ను ఎట్టి ప‌రిస్థితుల్లో ర‌ద్దు చేసేది లేద‌ని ప్రెసిడెంట్ సిరిసేన తెలిపారు.

Related Stories: