ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 45 లక్షలు చోరీ

భువనేశ్వర్ : ఒడిశా రూర్కేలాలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో మంగళవారం ఉదయం భారీ చోరీ జరిగింది. ఉదయం 10.30 గంటల సమయంలో ఏడుగురు వ్యక్తులు ఆయుధాలతో బ్యాంకులోకి ప్రవేశించారు. బ్యాంకులో ఉన్న సిబ్బందిని బెదిరించి రూ. 45 లక్షలను దోచుకెళ్లారు. చోరీకి ముందు బ్యాంకు సిబ్బందిని దొంగలు చితకబాదారు. దొంగలు హెల్మెట్లు ధరించి ఉండటంతో వారిని గుర్తు పట్టడం కష్టంగా మారింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చోరీకి పాల్పడ్డ గ్యాంగ్ జార్ఖండ్ రాష్ర్టానికి చెందిన గ్యాంగ్ అయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

× RELATED నేనలా అనలేదు.. ఇంటర్వ్యూని కావాలనే అలా ఎడిట్ చేశారు!