కారు స్పేర్ టైర్‌లో రూ. 2.3 కోట్లు తరలింపు

బెంగళూరు: కారు స్పేర్ టైర్‌లో నగదును అక్రమంగా తరలిస్తుండగా అధికారులు గుర్తించి పట్టుకున్నారు. ఈ ఘటన కర్ణాటకలో నిన్న చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి శివమొగ్గకు తరలిస్తున్న రూ. 2.3 కోట్ల నగదును ఐటీశాఖ అధికారులు గుర్తించి పట్టుకున్నారు. నిందితులు కారు స్పేర్ టైర్‌లో నగదును తరలిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఐటీ అధికారులు సోదాలు చేపట్టి నగదును స్వాధీనం చేసుకున్నారు. రూ. 2 వేల నోట్లతో కూడిన 20 బండిల్స్‌లో నగదును తరలిస్తున్నారు. ఎన్నికల్లో పంచేందుకే నగదును తరలిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు.
More in జాతీయం :